
లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైనిక వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16జవాన్లు వీర మరణం పొందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. నార్త్ సిక్కిం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
భారత్- చైనా సరిహద్దులో చట్టెన్ నుంచి థంగుకు మూడు సైనిక వాహనాలు కాన్వాయ్‌గా వెళ్తున్న క్రమంలో అందులో ఒక వాహనం అదుపు తప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13మంది సైనికులు ఉన్నారు.
ఆర్మీ
రక్షణ శాఖ మంత్రి సంతాపం
ప్రమాదం విషయం తెలిసిన ఆర్మీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని అధికారులు ప్రకటించారు.
సైనికుల మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నారు.