
Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ నేపథ్యంలో, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
అంతేకాకుండా, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
''క్రమశిక్షణాలంఘన'' కారణంగా వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు.
వివరాలు
ముస్లిం రిజర్వేషన్ అంశం.. అసెంబ్లీలో పెద్ద దుమారం
ఇదివరకు కూడా, ముస్లిం రిజర్వేషన్ అంశం అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది.
ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు సభలో వెల్‌లోకి దూసుకెళ్లి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలు చించి విసిరేయడం గందరగోళానికి దారితీసింది.
మరోవైపు, మంత్రి కేఎన్ రాజన్న తనపై హనీట్రాప్ కుట్ర జరిగిందని చేసిన సంచలన ఆరోపణ కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.