Page Loader
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నవయువ నావికుడి ఆత్మహత్య.. గురువారం తెల్లవారుజామున ఘటన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ఓ 19 ఏళ్ల అవివాహిత నావికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జులై 27న, గురువారం తెల్లవారుజామున సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించినట్లు ఇండియన్ నేనీ (INDIAN NAVY) ప్రకటించింది. ఘటనపై కేరళలోని స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశామని, ఈ మేరకు పోలీసులు నమోదు చేశారని భారత నౌకాదళం చెప్పుకొచ్చింది. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన ఈ నవయువ నావికుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గతంలోనూ పలువురు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం.ఒత్తిడి,ఇతర కారణాలతో నౌకదళం అధికారులు, సిబ్బంది బలవన్మరణానికి ఒడిగడుతుండటం నేవీని కలవర పెడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన భారత నౌకదళం