Page Loader
Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా
విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా

Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయవాడలో 101 ఎకరాలు,విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ పనులకు గత డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ రెండు నగరాల్లో మొదటి దశ పనులకు రూ.11,009 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అలాగే,డీపీఆర్‌లను కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు.ఈ ప్రాజెక్టులకు 100% నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికితోడు,భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.