
Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వరుసగా రెండవ రోజూ భారత్‌పై దాడులకు పాల్పడింది.
మే 9వ తేదీ శుక్రవారం నాడు, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని మొత్తం 20 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడులు జరిపిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
పాక్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, జైసల్మేర్, ఫిరోజ్‌పూర్, పోఖ్రాన్ వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేయడానికి పాక్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
వివరాలు
సరిహద్దు ప్రాంతాల్లో వార్ సైరన్లు
అలాగే, అవంతిపుర, పఠాన్‌కోట్‌లో ఉన్న ఎయిర్‌బేస్‌లతో పాటు శ్రీనగర్, జైసల్మేర్‌లోని విమానాశ్రయాలపై కూడా దాడులు చేయడానికి పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నాలు చేసింది.
ఈ పరిణామాల దృష్ట్యా వెంటనే భారత వాయుసేన అప్రమత్తమైంది. గగనతల రక్షణ వ్యవస్థను సక్రియం చేసి, ఆ డ్రోన్లను సమర్థవంతంగా వెనక్కి తిప్పికోటింది.
పాక్ పంపిన డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ అతి తక్కువ సమయంలోనే గమనించి వెంటనే కాల్చి పడేసింది.
ఇక మరోవైపు, పాకిస్థాన్ సైన్యం కాల్పులకు భారత దళాలు సమర్థంగా ప్రతిస్పందిస్తున్నాయి.
ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, సరిహద్దు ప్రాంతాల్లో వార్ సైరన్లు మోగించారు. దీంతో పాటు, అక్కడి ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ నిలిపివేసి బ్లాక్ అవుట్ ప్రకటించారు.
వివరాలు
శుక్రవారం (మే 9) పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్న నగరాలు:
అమృత్సర్ (పంజాబ్) పఠాన్‌కోట్ (పంజాబ్) జమ్మూ (జమ్మూ కాశ్మీర్) సాంబా (జమ్మూ కాశ్మీర్) ఫిరోజ్‌పూర్ (పంజాబ్) పోఖ్రాన్ (రాజస్థాన్) కుప్వారా (జమ్మూ కాశ్మీర్) ఉరి (జమ్మూ కాశ్మీర్) పూంచ్ (జమ్మూ కాశ్మీర్) గురుదాస్‌పూర్ (పంజాబ్) హంద్వారా (జమ్మూ కాశ్మీర్) జైసల్మేర్ (రాజస్థాన్) బార్మర్ (రాజస్థాన్) రాజౌరి (జమ్మూ కాశ్మీర్)