Loading...
Bomb Threat in Hyderabad: 26/11 తరహా దాడుల హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం
26/11 తరహా దాడుల హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

Bomb Threat in Hyderabad: 26/11 తరహా దాడుల హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడుల తరహాలో బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ లష్కరే తయ్యిబా పేరుతో బెదిరింపు మెయిల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌, టూరిస్ట్‌ ప్లాజాలో బాంబు స్క్వాడ్‌ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, హోటళ్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని, ధ్రువీకరించని సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

నగర పోలీసులను అప్రమత్తం చేసిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో లష్కరే తయ్యిబా టాప్‌ కమాండర్‌,మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామంటూ నవంబర్‌ 21న బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు సమాచారం.

దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు హైదరాబాద్‌ నగర పోలీసులను అప్రమత్తం చేశారు.

లష్కరే తయ్యిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి పంపించారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా హోటళ్లు,రైల్వే స్టేషన్లు,బస్టాండ్లు,జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గుర్తుతెలియని చోట్ల వదిలివెళ్లిన వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు సూచించారు.

అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని భద్రతా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ADVERTISEMENT