
India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర, పశ్చిమ భారతదేశం ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి.
తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది.
మే 9 నుంచి మే 14, 2025 వరకు ఈ ప్రాంతాల్లోని 32 విమానాశ్రయాల్లో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు ఉన్నాయని స్పష్టం చేసింది.
Details
ప్రభావితమయ్యే విమానాశ్రయాల జాబితా ఇదే
అధమ్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, అవంతిపూర్, బటిండా, భుజ్, బికానెర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్, కిషన్‌గఢ్
కులు-మనాలి (భుంటార్), లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పటియాలా, పోర్‌బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, షిమ్లా, శ్రీనగర్, థోయిస్, ఉత్తర్‌లై.
Details
మే 15 వరకు పౌర విమానాల రాకపోకలకు బ్రేక్
NOTAM ప్రకారం ఈ విమానాశ్రయాల్లో మే 15 వరకు పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తారు. ఇది మే 8న మొదట 24 విమానాశ్రయాలకే పరిమితమై ఉన్నప్పటికీ, తాజా పరిణామాల దృష్ట్యా దీన్ని విస్తరించారు.
ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు
భారత్ ఇటీవల పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.
దీనికి ప్రతిస్పందనగా పాక్ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో డ్రోన్, క్షిపణి దాడులు చేసింది.
భారత రక్షణ వ్యవస్థలు ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ విమాన భద్రతను మరింత పటిష్టం చేశారు.
Details
ప్రయాణికులకు పూర్తి డబ్బు రిఫండ్
ఈ పరిణామాల వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి విమానయాన సంస్థలు తమ రూట్లను రద్దు చేశాయి.
ఎయిర్ ఇండియా - జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది.
ప్రయాణికులకు పూర్తి డబ్బు రిఫండ్ లేదా ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఇండిగో కూడా NOTAM పరిధిలో ఉన్న నగరాలకు తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్‌లో రిబుకింగ్, రిఫండ్ లింకులు అందుబాటులో పెట్టింది.
Details
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కఠిన ఆదేశాలు జారీ
ప్రయాణికులు కనీసం మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి రావాలి
సెకండరీ లాడర్ పాయింట్ చెక్‌లు (SLPC) తప్పనిసరి
టెర్మినల్స్‌లోకి సందర్శకుల ప్రవేశం నిషేధం
అవసరమైన చోట ఎయిర్ మార్షల్స్ మోహరింపు
ఈ క్రమంలో ఇప్పటికే వందలాది విమానాలు రద్దు చేశారు.
కాబట్టి ఈ సమయంలో ఉత్తర లేదా పశ్చిమ భారతదేశానికి ప్రయాణించే వారు తమ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలి.
ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లు, అధికారిక ప్రకటనలు పరిశీలిస్తూ తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.