Loading...
CM Chandrababu: మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

CM Chandrababu: మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని సూచించారు. భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితులపై శనివారం ఆయన విదేశాల నుంచి సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జలమయమైన నివాస ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, రిజర్వాయర్లకు వస్తున్న నీటి ప్రవాహాల పరిస్థితిని ఆయనకు తెలియజేశారు. పలు జిల్లాల్లోని రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా అధికారులు వివరించారు.

వివరాలు

రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు

ఉత్తరాంధ్రలో నెలకొన్న ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు.

కాకినాడ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన 9 మంది మత్స్యకారులు శనివారం ఉదయం ఒడిశాలోని పారాదీప్‌ వద్దకు సురక్షితంగా చేరుకున్నారని తెలిపారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వర్షపాత లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు.

కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉందని తెలిపారు.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అయితే ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోందని చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

వివరాలు

ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలి

హిరమండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులను వేగవంతం చేయాలి.

జలవనరులు, విద్యుత్తుశాఖల ఉన్నతాధికారులు తక్షణమే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.

హిరమండలం లిఫ్ట్‌ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలించాలి.

కృష్ణానదికి స్థానికంగా వస్తున్న వరద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన బ్యారేజీల నిర్మాణం చేపట్టాలి.

ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో రెండు ఆనకట్టల నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు చేశామని, వాటిని ముందుకు తీసుకెళ్లాలి.

ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.

ADVERTISEMENT