Loading...
Supreme Court: 500 గ్రాముల బంగారం ఉన్నా ఆదాయ ఆధారాలు చూపించాల్సిందే: సుప్రీంకోర్టు
500 గ్రాముల బంగారం ఉన్నా ఆదాయ ఆధారాలు చూపించాల్సిందే: సుప్రీంకోర్టు

Supreme Court: 500 గ్రాముల బంగారం ఉన్నా ఆదాయ ఆధారాలు చూపించాల్సిందే: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

500 గ్రాముల బంగారం ఉన్నా.. దాని రాబడి ఆధారాలు చూపించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహిత వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉన్నప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల సమయంలో వాటిని జప్తు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో మాత్రం ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంపాదించారు? అనే విషయాలకు తగిన ఆధారాలు చూపించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీబీడీటీ (CBDT) మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ ప్రెస్ రిలీజ్‌లను చూపించి చట్టపరమైన విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సాధారణ కుటుంబాల్లో బంగారం నిల్వలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

కేసు నేపథ్యం.. పాట్నా హైకోర్టు ఉత్తర్వులు రద్దు

అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? బంగారం జప్తు నుంచి లభించే మినహాయింపునకు, దాని చట్టబద్ధమైన ఆదాయ మూలాలను నిరూపించుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? అనే అంశాలను న్యాయ నిపుణులు వివరించారు.

బిహార్‌కు చెందిన ఫుల్‌పారీ కుమారి, ఆమె భర్తపై 2015 మే 11న బిహార్ విజిలెన్స్ పోలీసులు అవినీతి నిరోధక చట్టం కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2020 జులై 29న విజిలెన్స్ శాఖ ఫుల్‌పారీ కుమారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

2021 జనవరి 28న పాట్నాలోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును విచారణకు స్వీకరించింది.

వివరాలు 

కేసు నేపథ్యం.. పాట్నా హైకోర్టు ఉత్తర్వులు రద్దు

ఈ విచారణను సవాలు చేస్తూ ఆమె పాట్నా హైకోర్టును ఆశ్రయించారు.

1994 మే 11న జారీ చేసిన సీబీడీటీ మార్గదర్శకాలు, 2016 డిసెంబర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌ను తన వాదనకు ఆధారంగా చూపించారు.

వాటి ప్రకారం ఐటీ సోదాల సమయంలో వివాహిత వద్ద 500 గ్రాములు, అవివాహిత వద్ద 250 గ్రాములు, పురుషుడి వద్ద 100 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను అధికారులు జప్తు చేయకూడదని పేర్కొన్నారు.

తన వద్ద ఉన్న బంగారం కూడా ఈ పరిమితుల్లోపే ఉందని ఆమె వాదించారు.

ఈ వాదనతో ఏకీభవించిన పాట్నా హైకోర్టు 2026 మే 14న ఆమెపై విచారణ కొనసాగించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

కేసు నేపథ్యం.. పాట్నా హైకోర్టు ఉత్తర్వులు రద్దు

అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసును విచారించిన సుప్రీంకోర్టు 2026 నవంబర్ 2న ఆ ఉత్తర్వులను పక్కనబెట్టింది.

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లి సభ్యులుగా ఉన్న ధర్మాసనం విజిలెన్స్ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన విచారణ ఉత్తర్వులను పునరుద్ధరించింది.

కొన్ని ప్రెస్ రిలీజ్‌లు, సర్క్యులర్లను చూపించినంత మాత్రాన ఆస్తులన్నీ చట్టబద్ధమైనవని నిరూపించినట్లు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అవినీతి నిరోధక చట్టం కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ ఆస్తులకు సంబంధించిన ఆదాయ వనరులను తగిన ఆధారాలతో నిరూపించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

జప్తు నుంచి మినహాయింపు వేరు.. ఆదాయ ఆధారాలు చూపించడం వేరు

సుప్రీంకోర్టు తీర్పుపై అకార్డ్ జురిస్ మేనేజింగ్ పార్టనర్ అలయ్ రజ్వి స్పందించారు.

ఈ ఉత్తర్వులు ఫుల్‌పారీ కుమారి నేరం చేసినట్లు నిర్ధారించేవి కావని, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగించేందుకు మాత్రమే అనుమతిస్తున్నాయని వివరించారు.

సీబీడీటీ 1994 మార్గదర్శకాలు, 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన స్పష్టత ప్రకారం ఐటీ సోదాల సమయంలో నిర్దేశించిన పరిమితుల్లోపు ఉన్న బంగారు ఆభరణాలను అధికారులు జప్తు చేయకుండా రక్షణ ఉంటుందని తెలిపారు.

అయితే, ఆ ఆభరణాలను ఎలా కొనుగోలు చేశారు? వాటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నుంచి ఈ నిబంధనలు మినహాయింపు ఇవ్వవని పేర్కొన్నారు.

వివరాలు 

జప్తు నుంచి మినహాయింపు వేరు.. ఆదాయ ఆధారాలు చూపించడం వేరు

కుటుంబాలు తమ ఆదాయ వనరులను సక్రమంగా నిరూపించగలిగితే ఎంత బంగారమైనా చట్టబద్ధంగా కలిగి ఉండవచ్చని అలయ్ రజ్వి వివరించారు.

అంతేకాదు.. నిర్ణీత పరిమితిలోపు బంగారం ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధంగా సంపాదించిన ఆస్తి అని భావించలేమని స్పష్టం చేశారు.

అదే విధంగా, నిర్దేశించిన పరిమితికి మించి బంగారం ఉన్నంత మాత్రాన అది అక్రమంగా సంపాదించినదని కూడా చెప్పలేమని తెలిపారు.

వివరాలు 

సాధారణ కుటుంబాలు ఆందోళన చెందాలా?

సుప్రీంకోర్టు తీర్పుతో సాధారణ కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశోక్ ప్రాంశు అండ్ కో పార్టనర్ ప్రాంశు జి తెలిపారు.

ఈ తీర్పు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై నమోదయ్యే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించినదని వివరించారు.

నిషేధం లేని పరిమాణంలో బంగారం కలిగి ఉన్నప్పుడు దాని చట్టబద్ధమైన ఆదాయ వనరులను వివరించగలగడం ముఖ్యమని చెప్పారు.

సాధారణ పౌరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనల్లో ఈ తీర్పుతో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు.

నిజాయితీగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారానికి చట్టపరమైన రక్షణ ఉంటుందని తెలిపారు.

వివరాలు 

బంగారం నిల్వలకు ఆధారాలుగా ఏ పత్రాలు దాచుకోవాలి?

బంగారం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన బిల్లులు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులు భద్రపరచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

వారసత్వంగా వచ్చిన ఆభరణాలకు సంబంధించిన విల్లు (Wills), బహుమతి పత్రాలు, పెళ్లి సమయంలో బంగారం ధరించిన ఫొటోలు కూడా భద్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

ముఖ్యంగా పాతకాలపు ఆభరణాలు, తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారానికి సంబంధించి ప్రతీ వస్తువుకూ కొనుగోలు రశీదు ఉండాలనే నిబంధన లేదు.

అయినప్పటికీ, ఎప్పుడైనా ఆదాయపు పన్ను శాఖ విచారణ లేదా విజిలెన్స్ తనిఖీలు ఎదురైతే ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించడానికి అందుబాటులో ఉన్న పత్రాలు, ఇతర ఆధారాలు ఉపయోగపడతాయి.

అందువల్ల బంగారం కొనుగోలు, బహుమతులు, వారసత్వంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన వివరాలను సాధ్యమైనంతవరకు భద్రపరచుకోవడం మంచిది.

ADVERTISEMENT