LOADING...
Jharkhand: జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి 
జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు

Jharkhand: జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌ను సీఆర్పీఎఫ్‌ (కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు), రాష్ట్ర పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఘటనా ప్రాంతంలో భద్రతా బలగాలు ఎస్‌ఎల్‌ఆర్‌ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్), ఇన్సాస్‌ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మావోయిస్టులు,భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..