Page Loader
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది. ఈసమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ఈ పెట్టుబడులు సుమారు 35 వేల మందికి ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయని అంచనా. ఎనర్జీ, టూరిజం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌, వాసంశెట్టి సుభాష్‌ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం