Maharashtra : మహారాష్ట్రలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికిపైగా గాయపడ్డారు. దుర్గామాత విగ్రహంతో వెళ్తున్న టెంపో పికప్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుర్గాదేవి విగ్రహాన్ని తరలిస్తుండగా.. షేగావ్ నుంచి వార్దాకు దుర్గాదేవి విగ్రహాన్ని తరలించేందుకు భక్తులు టెంపో పికప్‌లో బయలుదేరారు. సమృద్ధి హైవేపై ధమన్‌గావ్ రైల్వే సమీపంలోని ఛానల్ 97 వద్దకు చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. టెంపోకు వెనుక ట్రాలీ అమర్చడంతోపాటు వాహనం నెమ్మదిగా ప్రయాణిస్తోంది. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెంపోను ఢీకొట్టింది.
వివరాలు
నుజ్జునుజ్జయిన టెంపో, ట్రాలీ
ట్రక్కు బలంగా ఢీకొనడంతో టెంపో వెనుక భాగం, దానికి అనుసంధానంగా ఉన్న ట్రాలీ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని వెంటనే రక్షించి వార్దాలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
ట్రక్కు డ్రైవర్ అదుపులోకి
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం
#BREAKING Five killed and twenty injured after a speeding truck collided with a Bolero pickup van near Dhamangaon in Maharashtra's Amravati district.@CMOMaharashtra @DGPMaharashtra @AmravatiPolice #SamruddhiHighway #AmravatiAccident #RoadSafety #MaharashtraNews pic.twitter.com/OeCvW3yAzu
— jarvis ☠️ (@Vishii14) October 2, 2026