
ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
అయితే, వారిలో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు, అంటే 86 శాతం మంది తగినన్ని ఓట్లు పొందలేకపోయారు.
ఈ అభ్యర్థులలో 584 మంది ఆరు జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు, 68 మంది రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, 2,633 మంది నమోదు అయిన కానీ గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులు.
ఇక స్వతంత్ర అభ్యర్థులు 3,095 మంది ఉండగా, వారిలో కేవలం ఏడుగురు మాత్రమే విజయం సాధించారు. ఈ వివరాలను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
వివరాలు
6 జాతీయ పార్టీలకు 63 శాతం ఓట్లు
2024 లోక్‌సభ ఎన్నికలలో చెల్లుబాటైన ఓట్లలో 63 శాతం ఓట్లు 6 జాతీయ పార్టీలకు దక్కాయి.
ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, సీపీఎం, ఆప్, ఎన్‌పీపీ. వీటితో పాటు గుర్తింపు పొందిన 47 రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు, 690 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.
3,921 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయగా, వారిలో ఏడుగురు మాత్రమే గెలిచారు.
నోటా (NOTA)కు 63,71,839 ఓట్లు, అంటే 0.99 శాతం ఓట్లు లభించాయి. ఇది 2019లో నమోదైన 1.06 శాతానికి తక్కువ.
వివరాలు
దేశంలోని మొత్తం ఓటర్లు
97.97 కోట్లు: దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య
64.64 కోట్లు: ఓటింగ్‌లో పాల్గొన్నవారు
65.78% మహిళలు
65.55% పురుషులు
ఈవీఎం ద్వారా ఓటు వేసిన వారు: 64,21,39,275
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు చేసిన వారు: సుమారు 43 లక్షల మంది