
దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.
కోవిడ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 29మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. కొత్త మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,31,398కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.38 శాతంగా ఉంది.
దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లుగా నమోదైంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉన్నాయి.
జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.68 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కు పెరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేశంలో 61,013కు చేరిన యాక్టివ్ కేసులు
India’s has registered 9,629 new #COVID cases. The active caseload currently stands at 61,013. Yesterday, India reported 6,660 cases. #CovidCases #IndiaNews https://t.co/dj0BOL1mhr pic.twitter.com/Dm5OhACk0K
— News18.com (@news18dotcom) April 26, 2023