Page Loader
Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే.. 
Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే..

Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే.. 

వ్రాసిన వారు Stalin
Dec 24, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. నోయిడాలో చీకు యాదవ్ అనే పిల్లవాడు తన తండ్రితో రూ.700కి థార్ కారు కొనుక్కోవడం గురించి మాట్లాడుతున్న వీడియోపై ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా ఆదివారం చమత్కారంగా స్పందించారు. తాను కొన్ని చీకు యాదవ్ ఇన్ స్టా పోస్టులను చూసినట్లు పేర్కొన్నారు. అతను అంటే తనకు కూడా ఇష్టమే అన్నారు. 'నా ఏకైక సమస్య ఏమిటంటే.. చీకు చెప్పినట్లు మేము మహీంద్రా థార్ వాహనాన్ని రూ.700 అమ్మితే.. అతి త్వరలోనే తీస్తాం' అని ఆనంద్ మహీంద్ర చమత్కారంగా ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆనంద్ మహీంద్ర ట్వీట్