Page Loader
Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి 
Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి

Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 25, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయాలపాలైన చిన్నారి 17రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడాడు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అనూష, అంజి దంపతులు ఈనెల 8న నాలుగేళ్ల శరత్‌ను గుడిసెలో పడుకోబెట్టి వారు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంటికి తిరిగొచ్చే సరికి కుక్కల దాడిలో శరత్ తీవ్ర గాయాలతో కనిపించాడు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనతో నిలోఫర్ కు తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఉస్మానియా డాక్టర్లు శరత్‌కు చికిత్స అందించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

17రోజులు మృత్యువుతో పోరాటం