Loading...
Mumbai: 60 రోజుల పాటు నిద్రపోయి రూ.9.6 లక్షలు గెలుచుకుంది.. ముంబయి అమ్మాయి అరుదైన ఘనత!
60 రోజుల పాటు నిద్రపోయి రూ.9.6 లక్షలు గెలుచుకుంది.. ముంబయి అమ్మాయి అరుదైన ఘనత!

Mumbai: 60 రోజుల పాటు నిద్రపోయి రూ.9.6 లక్షలు గెలుచుకుంది.. ముంబయి అమ్మాయి అరుదైన ఘనత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయికి చెందిన జినియా ఛటర్జీ టీచర్‌గా, డాన్సర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మల్టీ టాలెంటెడ్ యువతి తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 60 రోజుల పాటు నిద్ర పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ పోటీలో గెలుపొందడంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. నిద్రపోయినందుకు ఆమెకు ఏకంగా రూ.9.6 లక్షల బహుమతి కూడా లభించింది. అంతేకాకుండా సంస్థ తరఫున స్పాన్సర్ చేసిన విహారయాత్రను బోనస్‌గా అందుకుంది.

వివరాలు

వేక్‌ఫిట్ నిద్ర పోటీలో విజేతగా జినియా

ప్రముఖ సంస్థ 'వేక్‌ఫిట్‌' నిర్వహించిన ఐదో ఎడిషన్ 'స్లీప్ ఇంటర్నేషనల్' పోటీలో జినియా ఛటర్జీ విజేతగా నిలిచింది.

సాధారణంగా ప్రతిభను నిరూపించుకోవడానికి వివిధ పోటీల్లో పాల్గొంటుంటారు.

కానీ ఈ పోటీలో మాత్రం ఎక్కువ సమయం గాఢంగా నిద్రపోవడమే అసలైన టాస్క్. ఈ వినూత్న పోటీలో జినియా తన ప్రతిభను చాటుకుని విజేతగా నిలిచింది.

వివరాలు

రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు

ఈ పోటీకి దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

నిర్వాహకులు నిర్వహించిన వివిధ వడపోతల అనంతరం చివరకు కేవలం పది మంది మాత్రమే తుది దశకు చేరుకున్నారు.

వీరికి నిద్రకు సంబంధించిన రకరకాల ఆసక్తికరమైన, చిత్రవిచిత్రమైన టాస్క్‌లు ఇచ్చారు. వాటన్నింటిలోనూ పాల్గొన్న జినియా తన ప్రత్యేకతను చాటుకుంది.

ADVERTISEMENT

వివరాలు

సినిమా నటుల అనుకరణ నుంచి గురక పెట్టడం వరకు..

పోటీలో భాగంగా నిర్వాహకులు పాల్గొనేవారికి ఎన్నో వినూత్నమైన సవాళ్లు విసిరారు. రకరకాల సినిమాలు చూస్తూ, అందులోని నటీనటులను అనుకరిస్తూ నిద్రపోవడం వంటి టాస్క్‌లు ఇచ్చారు.

అంతేకాకుండా చుట్టూ ఎలాంటి శబ్దాలు చేసినా నిద్రాభంగం కాకుండా గుర్రుపెట్టి నిద్రపోవాల్సి ఉండేది.

మాటల పోటీలో 'బ్లాంకెట్‌', 'పిల్లో' అనే పదాలను అత్యధికంగా ఉపయోగించడం వంటి ఆసక్తికరమైన టాస్క్‌లు కూడా నిర్వహించారు.

ADVERTISEMENT

వివరాలు

నిద్ర స్కోర్ల ఆధారంగా విజేత ఎంపిక

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రదర్శనను నిర్వాహకులు నిశితంగా పరిశీలించారు. వివిధ టాస్క్‌లలో వారు సాధించిన స్కోర్లతో పాటు నిద్రకు సంబంధించిన స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

అన్ని అంశాలను విశ్లేషించిన అనంతరం జినియా ఛటర్జీని విజేతగా ప్రకటించారు.

దీంతో ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు వేక్‌ఫిట్ సంస్థ స్పాన్సర్ చేసిన విహారయాత్ర కూడా దక్కింది.

ఇలా 60 రోజుల నిద్ర పోటీలో పాల్గొని భారీ బహుమతి గెలుచుకోవడం ద్వారా జినియా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT