
Medaram Jathara: మేడారం జాతర భక్తులకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ములుగు జిల్లా మేడారంలో జరిగే భారీ ఆదివాసీ కుంభమేళాకు వచ్చే భక్తులకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏం చేయాలో,ఏం చేయకూడదో సూచిస్తూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
జాతరకు విచ్చేసే భక్తుల కోసం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ మార్గదర్శకాలను విడుదల చేశారు.
ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా ప్రభుత్వం మేడారం పరిసర ప్రాంతాల్లో 150 మంది వైద్యులతో 72 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అంబులెన్స్ సేవలతో పాటు అవాంఛనీయ సంఘటనలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు భక్తులకు కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
Details
మేడారంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
చేయవలసినవి:
జాతర సమయంలో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది.'హైడ్రేటెడ్‌గా ఉండడం ముఖ్యం. అందుకని పుష్కలంగా ద్రవాలు తాగాలని వైద్యులు యాత్రికులకు సూచించారు.
భక్తులకు దాహం అనిపించకపోయినా, బాటిల్/ప్యాక్డ్, ఉడికించిన లేదా క్లోరినేట్ చేసిన నీటిని మాత్రమే త్రాగాలి.
భక్తులు వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.
దగ్గినా లేదా తుమ్మిన , టాయిలెట్లను ఉపయోగించిన, ఆహారాన్ని తీసుకునే ముందు, జంతువులను తాకిన తర్వాత సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోండి.
యాత్రికులు అన్ని వేళలా మాస్కులు ధరించాలి.
బాగా వండిన, తాజాగా తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. వినియోగానికి ముందు అన్ని పండ్లు, కూరగాయలను జాగ్రత్తగా కడగాలి.
Details
మేడారంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
వైద్య సంరక్షణ:
జ్వరం,దగ్గు,గొంతునొప్పి, ముక్కు కారటం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,ఒళ్ళు నొప్పులు,తలనొప్పి వంటి ఏవైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో వైద్యడిని సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్నిసందర్శించడం లేదా హెల్ప్‌లైన్ 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించండి. ఎటువంటి ఆలస్యం లేకుండా ఆరోగ్య సేవలను పొందండి.
చేయకూడనివి:
భక్తులు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించకూడదు.
తినుబండారాలు,పక్కపక్కనే ఉన్న దుకాణాల నుంచి పండ్లు,కూరగాయలు తినడం మానుకోండి. 'ఐస్ క్యూబ్స్,పచ్చి పాలు లేదా బ్రాండెడ్ పాల ఉత్పత్తులు,పచ్చి లేదా తక్కువ ఉడికించిన పౌల్ట్రీ లేదా మాంసం ఉత్పత్తులను తీసుకోకండి.
బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన,టాయిలెట్ కి వెళ్ళకండి.
జంపన్నవాగులో పుణ్యస్నానం చేసేందుకు సిద్ధమైతే,ఎక్కువ సేపు చల్లని దుస్తుల్లో ఉండకండి.