Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు
సైబర్ మోసాల పంథా రోజురోజుకు కొత్త కోణాల్లో అమాయకులను మోసం చేస్తోంది. తాజాగా ఏలూరుకు చెందిన శేషగిరి అనే వ్యక్తి ఈ మోసానికి బలయ్యారు. ఘటన ఏంటంటే, ఏలూరులోని అశోక్‌నగర్ నివాసి శేషగిరి ఖాతాకు అనుకోకుండా గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.20 వేలు జమయ్యాయి. అతను వెంటనే కాల్ చేసి పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించామని, దయచేసి తిరిగి పంపించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ మాటలు నమ్మిన శేషగిరి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని తిరిగి పంపించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
అయితే కొద్ది రోజులకు తన ఖాతా పరిశీలించగా, అతని ఖాతాలో మొత్తం రూ.46 లక్షలు ఖాళీ అయినట్లు కనిపించింది. వెంటనే షాక్ అయిన బాధితుడు పోలీసుల్ని సంప్రదించాడు. ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లావాదేవీలకు నమ్మోద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.