Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ శివారులో ఘోరో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. ఈ మంటల ధాటికి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలింది.
ఈ క్రమంలో భారీగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు బయటకు పరుగులు తీశారు.
ఎగిసిపడుతున్న మంటలను చూసి భయపడ్డ.. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిప్రమాద దృశ్యాలు
హైదరాబాద్ అనాజ్ పూర్ లో .. అగ్నిప్రమాదం#Hyderabad #Anajpur #FireAccident #NTVNews #NTVTelugu pic.twitter.com/QgKmMLo0Y0
— NTV Telugu (@NtvTeluguLive) February 11, 2024