Oasis Fertility Centres: ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ అక్రమ అండాల సేకరణ, అక్రమ సంతాన సాఫల్య (ART) రాకెట్ కేసులో మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 1145/2026 కేసులో ఇప్పటికే దుర్గా ప్రసాద్, అమిత్, ఎన్. నిఖత్ పర్వీన్‌లను అరెస్ట్ చేశారు. తాజాగా సంస్థకు చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ డివిజన్ ఏసీపీ బి. రవీంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ అరెస్టులు చేసింది. అరెస్టయిన వారిలో ముంబైకి చెందిన ప్రతీక్ అనిల్ గగ్లానీ (44) ఉన్నారు.
వివరాలు
తన
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నల్లగండ్లలో నివాసముంటున్న ఆయన ఒయాసిస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పనిచేస్తున్నారు.
ఈ కేసులో ఆయనను A-8గా చేర్చారు. అలాగే అస్సాంకు చెందిన డాక్టర్ రాజర్షి దేబ్ (53)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న ఆయన బేగంపేటలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ కార్పొరేట్ కార్యాలయంలో మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు.
ఈయనను A-9గా పేర్కొన్నారు. వీరిపై బీఎన్ఎస్లోని పలు కీలక సెక్షన్లతో పాటు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లోని సెక్షన్లు 33(2), 34 కింద కేసులు నమోదు చేశారు.
వివరాలు
ఏజెంట్ల ద్వారా మహిళల తరలింపు.. ప్రమాదకర ఇంజెక్షన్లు
నవంబర్ 27న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో మధ్యవర్తుల సమక్షంలో నిర్వహించిన విచారణలో నిందితులు ఈ అక్రమ దందా వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో ఒయాసిస్ సంస్థకు మొత్తం 10 సెంటర్లు ఉండగా.. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్లలో నాలుగు లెవల్-2 ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లు ఉన్నట్లు విచారణలో తేలింది.
సంస్థ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ గెదెల దుర్గారావు ఆదేశాల మేరకు మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ ఇన్చార్జ్ సునీల్ రాయ్ ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పించేవాడు.
అండాల ఉత్పత్తి పెరిగేందుకు వారికి HUMO-G, FOLLI SURGE, METERNA, TREGARవంటి ప్రమాదకర ఇంజెక్షన్లు ఇచ్చేవారు.
అనంతరం వారిని లెవల్-2 క్లినిక్‌లకు తరలించి అక్రమంగా అండాలను సేకరించేవారని పోలీసులు గుర్తించారు.
వివరాలు
నెలకు రూ.28 కోట్ల ఆదాయం.. రూ.487 కోట్ల లావాదేవీలు
2025 నుంచి సంస్థలో సీఓఓగా పనిచేస్తున్న ప్రతీక్ గగ్లానీ (A-8), ఈ అక్రమ కార్యకలాపాలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, వసతుల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించేవాడు.
సంస్థ సీఎఫ్ఓ (CFO) ఆశిష్ అగర్వాల్ ద్వారా నిధుల సమన్వయం కూడా చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా ఒయాసిస్కు చెందిన 43 క్లినిక్‌లలో నెలకు సుమారు 600 సెల్ఫ్-సైకిల్స్, 100 డోనర్ సైకిల్స్ నిర్వహించడం ద్వారా దాదాపు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏప్రిల్ 1, 2026 నుంచి నవంబర్ 26, 2026 మధ్య సంస్థకు చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.487.82 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు.
వివరాలు
భారీ జీతాల కోసం అక్రమాలకు సహకారం
డాక్టర్ రాజర్షి దేబ్ (A-9) ఏప్రిల్ 2026 నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్ల సిద్ధతను పర్యవేక్షించడంతో పాటు, యాజమాన్యం విధించే అక్రమ నిబంధనలకు అంగీకరించే వైద్యులను మాత్రమే నియమించేవారని విచారణలో తేలింది.
తాము చేస్తున్నది చట్టవిరుద్ధమని తెలిసినా.. యాజమాన్యం నుంచి లభించే భారీ జీతభత్యాల కోసం ఈ రాకెట్‌కు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ప్రతీక్ గగ్లానీ, రాజర్షి దేబ్ విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు.
వీరిలో ఒకరికి నెలకు రూ.4.20 లక్షలు, మరొకరికి రూ.3.60 లక్షల చొప్పున జీతం అందుతున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి మూడు ఖరీదైన ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీ