Page Loader
ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Stalin
Mar 28, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లోక్‌సభ సెక్రటరీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌లోని ఎంఎస్‌ బ్రాంచ్‌ డిప్యూటీ సెక్రటరీకి రాహుల్ లేఖ రాశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా మార్చి 27న రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు ఇచ్చింది. ఏప్రిల్ 24 నుంచి ప్రభుత్వ బంగ్లా కేటాయింపు రద్దు కానుంది.

రాహుల్ గాంధీ

నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నిక: రాహుల్ గాంధీ

గత నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైనట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ఈ బంగ్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తనను ఇక్కడికి పంపిన ప్రజలకు రుణపడి ఉంటానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలగకుండా, బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.