Page Loader
రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు
రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు

రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు

వ్రాసిన వారు Stalin
Mar 26, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఆదివారం అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లోని గాంధీ విగ్రహాల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు 'సత్యాగ్రహం' నిర్వహిస్తున్నాయి. అయితే దిల్లీలో రాజ్‌గట్ వద్ద నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ సమస్య పేరుతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాజ్‌గట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. 144సెక్షన్‌ను విధించారు. ఆంక్షలు ఉన్నప్పటికీ రాజ్‌గట్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ సామాన్య ప్రజల కోసం పోరాడుతున్నారు: ఖర్గే

రాజ్‌గట్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సత్యాగ్రహాలు జరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ సామాన్య ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో మాట్లాడితే కేసు గుజరాత్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో పరువు నష్టం కేసు పెట్టే సత్తా బీజేపీకి లేదన్నారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ లోక్‌సభ ఎంపీగా అనర్హుడయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ "దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకు" అని రాహుల్ చేసిన వ్యాఖ్యకు అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.