Page Loader
దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?
దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

వ్రాసిన వారు Stalin
Mar 25, 2023
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. ఏదైనా కేసులో దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త, పీహెచ్‌డీ స్కాలర్ ఆభా మురళీధరన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) కింద దోషి తేలిని ఎంపీ, ఎమ్మెల్యేను ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడం ఏకపక్షమే కాకుండా చట్టవిరుద్ధం కూడా అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. రెండేళ్ల గరిష్ట శిక్ష పడిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేను ఆటోమేటిక్‌గా అనర్హుడిగా ప్రకటించడమనేది ప్రజాప్రతినిధి వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణను ఉల్లంఘించటమే అవుతుందని మురళీధరన్ తన పిటిషన్‌లో వెల్లడించారు.

సుప్రీంకోర్టు

వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం

సెక్షన్ 8(3) అనేది ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు లేదా శాసనసభ సభ్యుని స్వేచ్ఛా ప్రసంగాన్ని పరిమితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులు వారి సంబంధిత నియోజకవర్గ ఓటర్లు తమపై విధించిన విధులను స్వేచ్ఛగా నిర్వర్తించకుండా ఈ సెక్షన్ నిరోధిస్తుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించి, నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ పిటిషన్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పిటిషన్‌ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.