Page Loader
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు

వ్రాసిన వారు Stalin
Mar 24, 2023
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 'మోదీ ఇంటిపేరు'పై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఈ నెల 23న రాహుల్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. ఆరోజు నుంచే అతను లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడైనట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ నోటీసులో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దోషిగా తేలిన తర్వాత తొలిసారిగా శుక్రవారం ఉదయం లోక్‌సభకు హాజరయ్యారు. ఆ తర్వాత సభ గంటపాటు వాయిదా పడింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ

రాహుల్ గాంధీ

ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌పై వేటు

'దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది' అని రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిట్లు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ చేసిన వ్యాఖ్యపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిమినల్ పరువు నష్టం కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసును నాలుగేళ్ల పాటు విచారించిన కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకు కానీ ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకు మించి జైలు శిక్ష ఖరారైతే వారు తమ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.