NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

    వ్రాసిన వారు Stalin
    Mar 24, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

    సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ రాజకీయ భవిష్యత్‌పైనే కాకుండా కాంగ్రెస్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.

    ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదని, ఇది తీవ్రమైన రాజకీయ సమస్య అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు ఇదొక గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు.

    ఈ వ్యవహారంలో రాహుల్‌కి ప్రతిపక్షాలు బాసటగా నిలుస్తున్నాయి.

    విపక్షాలతో కలిసి మోదీకి వ్యవతిరేకంగా, రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

    ప్రాతినిధ్య చట్టం

    ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెబుతోంది?

    ప్రాతినిధ్య చట్ట ప్రకారం ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేకు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్షను ఖరారు చేసినట్లయితే, దోషిగా తేలిన సమయం నుంచి చట్టసభలకు అనుమతి ఉండదని, అనర్హులుగా పరిగణించబడతారని 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చేప్పింది.

    ఇప్పుడు పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షపడింది. అందుకే రాహుల్‌పై అనర్హత వేటు ఖాయని నిపుణులు అంటున్నారు.

    అయినా కూడా రాహుల్ అనర్హత వేటు తప్పించుకోవడానికి మార్గం ఉందంటున్నారు రాజ్యాంగ న్యాయ నిపుణుడు రాకేష్ ద్వివేది. శిక్షపడినప్పటి నుంచి 90 రోజుల లోపు పై కోర్టుకు అప్పీల్ చేసుకొని, శిక్షను రద్దు చేసుకోవడమో లేక నేరారోపణపై స్టే తెచ్చుకోవడమో చేయాలని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    సూరత్
    కాంగ్రెస్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్

    సూరత్

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ

    కాంగ్రెస్

    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ భారతదేశం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన గౌతమ్ అదానీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025