LOADING...
Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

వ్రాసిన వారు Stalin
Mar 25, 2023
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య, కనకపుర నుంచి డీకే శివకుమార్‌ పోటీ చేయనున్నారు. గతంలో, సిద్ధరామయ్య కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గంలోని పార్టీ స్థానిక నాయకుల మధ్య విబేధాల నేపథ్యంలో అధిష్ఠానం సూచన మేరకు కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్

మార్చి 17న తొలి జాబితాను ఫైనల్ చేసిన అధిష్ఠానం

యెమకనమర్డి నుంచి కాంగ్రెస్‌నేతలు సతీష్‌జార్కిహోళి, బెల్గాం రూరల్‌నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్‌, చితాపూర్‌నుంచి ప్రియాంక్‌ఖర్గే, శివాజీనగర్‌నుంచి రిజ్వాన్‌అర్షద్‌, గాంధీనగర్‌నుంచి దినేశ్‌గుండూరావు తదితరులు తొలి జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ), రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులు మార్చి 17న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మొదటి జాబితాను ఫైనల్ చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలపై ఇటీవల మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీకి 65 సీట్ల కంటే ఎక్కువ రావని పేర్కొన్నారు. రైతులతో సహా తమ రాష్ట్రంలోని ప్రజలందరూ ఇదే చెబుతున్నారని శివకుమార్ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా