Loading...
Bird Flu Vaccine: బర్డ్‌ఫ్లూపై భారత్‌ కీలక ముందడుగు.. తొలి స్వదేశీ టీకా సిద్ధం
బర్డ్‌ఫ్లూపై భారత్‌ కీలక ముందడుగు.. తొలి స్వదేశీ టీకా సిద్ధం

Bird Flu Vaccine: బర్డ్‌ఫ్లూపై భారత్‌ కీలక ముందడుగు.. తొలి స్వదేశీ టీకా సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌ తొలి స్వదేశీ టీకాను అభివృద్ధి చేసింది. భోపాల్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (NIHSAD) ఈ టీకాను రూపొందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నవంబర్‌ 20న భోపాల్‌లో ఈ టీకాను దేశానికి అంకితం చేయనున్నారు.

వివరాలు

కోళ్లు, పక్షుల మరణాలను అరికట్టడమే లక్ష్యం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులు మృత్యువాత పడుతున్నాయి.

ఈ సమస్యను నివారించాలనే లక్ష్యంతో ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ కొంతకాలంగా టీకా అభివృద్ధిపై పరిశోధనలు, పరీక్షలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే తొలి స్వదేశీ టీకాను సిద్ధం చేసింది.

వివరాలు

మార్కెట్‌లోకి ఎప్పుడొస్తుంది?

తొలి స్వదేశీ బర్డ్‌ఫ్లూ టీకాను నవంబర్‌ 20న అధికారికంగా దేశానికి అంకితం చేయనున్నారు.

అయితే ఈ టీకా మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? పౌల్ట్రీ రంగంలో వినియోగానికి ఎప్పటి నుంచి అనుమతి లభిస్తుంది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT