Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో అస్సాం రైఫిల్స్‌కు చెందిన నాలుగు బృందాలు, పారామిలిటరీ దళం, ఆర్మీ వెంటనే రంగంలోకి దిగి.. కొన్ని గంటల్లోనే ఆ పోలీస్ ఆఫీసర్‌ను రక్షించాయి.
పోలీసులు, భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో ఆపరేషన్స్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్పీ అమిత్ కుమార్‌ను రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఏఎస్పీని ఆసుపత్రిలో చేర్పించినట్లు, అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
మణిపూర్
కిడ్నాప్ ఎందుకు చేశారంటే?
మంగళవారం సాయంత్రం 7గంటల సమయంలో ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్ఖీలో ఉన్న అమిత్ కుమార్ ఇంటిపై మైతీ తెగకు చెందిన సాయుధులు దాడి చేశారని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో నాలుగు వాహనాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వాహన చోరీకి పాల్పడినందుకు ఆరుగురు అరాంబై టెంగోల్ కార్యకర్తలను ఏఎస్పీ అమిత్ కుమార్ చేయడమే.. ఈ దాడికి కారణం కావడం గమనార్హం.
ఆరుగురి అరెస్టు తర్వాత వారిని విడుదల చేయాలని మైతీ తెగకు చెందిన మహిళా సంఘం బృందం నిరసన తెలిపింది. రోడ్లను దిగ్బంధించింది.
అయినా వారిని విడుదల చేయకపోవడంతో ఆగ్రహించిన 200 మంది సాయుధులు తుపాకులతో ఏఎస్పీ ఇంటిపై దాడులు చేశారు.