Andhra Pradesh: మరో పథకానికి కొత్త పేరు.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాల పేర్లను మారుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లను తొలగించి, కొత్తగా నామకరణం చేస్తోంది.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది.
అయితే ఇప్పుడు ఈ కాలనీల పేర్లను PMAY-NTR నగర్‌గా మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో పార్టీల ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలకు వారి నాయకుల పేర్లు పెట్టడం సాధారణం.
Details
జగన్ పేరును తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం
వైసీపీ హయాంలో కొన్ని పథకాల పేర్లలో జగన్ పేరును ఉపయోగించారు.
అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక, జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాలకు కొత్త పేర్లు పెట్టడంపై దృష్టి సారించింది.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా పేరు మార్చింది. జగన్ విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చింది.
అంతేకాకుండా జగనన్న గోరు ముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు పెట్టింది. తాజాగా జగనన్న కాలనీల పేరును PMAY-NTR నగర్‌గా మార్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.