Page Loader
Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!
Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!

Apple: ప్రతిపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్.. ఆపిల్ అధికారులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు!

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిపక్ష నేతల ఆపిల్ ఐఫోన్ల హ్యాకింగ్ వివాదం దేశంలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు అలర్ట్ నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా చెబుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌లను రాబోయే సమావేశానికి పిలవాలని స్టాడింగ్ కమిటీ ఆలోచిస్తోందని ప్రముఖ వార్తా సంస్థ ANIపేర్కొంది.

ఆపిల్

అలర్ట్ నోటిఫికేషన్లు మేం పంపలేదు: ఆపిల్

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరాతో సహా ప్రతిపక్ష నాయకులు తమ ఐఫోన్‌లు హ్యాక్ అయినట్లు అలర్ట్ మెసేజ్‌లు రావడంతో వివాదం తలెత్తింది. హ్యాకింగ్ అలర్ట్ వచ్చిన వారి జాబితాలో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీల నేతలు కూడా ఉన్నారు. అయితే ఈ అంశంపై ఆపిల్ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము బెదిరింపు నోటిఫికేషన్‌ను పంపలేదని, ఇవి నకిలీవి అయి ఉండొచ్చని ఆపిల్ పేర్కొంది. ఈ అలర్ట్ మెసేజ్‌లు రాజకీయ ప్రముఖులకే పరిమితం కాకుండా జర్నలిస్టులు, మేథావులకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.