
మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
50ఏళ్ల మధ్య వయస్సు గల మారింగ్ అనే మహిళను శనివారం ఆమె నివాసంలో తుపాకీతో కాల్చి చంపారు.
ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆమె ముఖాన్ని దుండగులు వికృతంగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె నాగ సామాజిక వర్గానికి చెందినదని చెప్పారు.
మృతదేహాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్న వెంటనే, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హంతకులను పట్టుకోవడానికి స్థానికుల నుంచి వాంగ్మూలాలను సేకరించారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రౌండ్ల మందుగుండు సామాగ్రి, రెండు ఆయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మణిపూర్ పోలీసులు చేసిన ట్వీట్
*9 Persons Arrested in connection with the Murder of a Woman at Keibi Heikakmapal Maning Ching:* 9 (nine) persons including 5 (five) women have been arrested by
— Manipur Police (@manipur_police) July 16, 2023
1/2