Page Loader
టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్
టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్

టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్​, పాన్​ కార్డు వివరాలు అవుట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దేశీయ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్​ లీకులకు గురైంది. ఈ మేరకు సదరు యాప్ లో ఆధార్​, పాన్​ కార్డు డేటా లీకేజీ జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది. అయితే కొవిన్​ పోర్టల్​ ద్వారానే ఈ డేటా లీకైనట్టు​ వెల్లడించింది. దీంతో భారత్ లో మరో డేటా బ్రీచ్​ ఘటన చోటు చేసుకున్నట్టైంది. ఇప్పటికే ఈ లీకులపై పలు కథనాలు బహిర్గతమయ్యాయి. దేశ ప్రజలంతా కొవిడ్​ కు వ్యాక్సినేషన్ తీసుకునేందుకు కొవిన్​ పోర్టల్​లో ప్రజలు తమ పూర్తి వివరాలను పొందుపరిచారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కొవిన్ పోర్టల్ ద్వారా భద్రతా పరంగా గోప్యంగా ఉండే ఈ వివరాలు ఇలా మెసెంజర్ యాప్ లో బహిర్గతమవడం కలకలం సృష్టిస్తోంది.

DETAILS

ప్రముఖ పొలిటీషియన్స్, జర్నలిస్టుల డేటా బహిర్గతం

టీకాలు తీసుకునే క్రమంలో ఇచ్చే ఫోన్ నంబర్ టెలిగ్రామ్‌ బాట్ లో టైప్ చేయగానే పూర్తి సమాచారం కనిపిస్తోంది. పేరు,ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, వ్యాక్సిన్ కేంద్రం వివరాలన్నీ పూర్తిగా లీకైయ్యాయి. అయితే ఈ పోర్టల్ కారణంగా ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టుల డేటా సైతం బట్టబయలైంది. పి.చిదంబరం, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తోపాటు పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్ ల డేటా ప్రజలందరికీ అందుబాటులో ఉండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ డేటా లీకేజీ బాధితుల్లో సాక్షాత్తు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా ఉన్నారని ఓ ప్రధాన దినపత్రిక వెల్లడించింది.