LOADING...
Advanced Firefighting Vehicles: వరదలు,అగ్నిప్రమాదాలకు సిద్ధం.. అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు.. పరికరాల ప్రత్యేకతలివే
వరదలు,అగ్నిప్రమాదాలకు సిద్ధం..

Advanced Firefighting Vehicles: వరదలు,అగ్నిప్రమాదాలకు సిద్ధం.. అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు.. పరికరాల ప్రత్యేకతలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం ఆధునిక వాహనాలు, పరికరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఈ చర్యలతో అగ్నిప్రమాదాలు, వరదలు, రసాయన ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి. 1. అగ్నిమాపక శకటాలు (అడ్వాన్డ్స్‌ ఫైర్‌ వాటర్‌ టెండర్లు) కొనుగోలు చేసినవి: 25 వ్యయం: రూ.18 కోట్లు ప్రస్తుతం ఉన్న 4,500లీటర్ల సామర్థ్య వాహనాల స్థానంలో,కొత్తగా వచ్చినవి 5 వేల నుంచి 10 వేల లీటర్ల నీటిని మోయగలవు. ఇవి అధిక ఒత్తిడితో నీటిని వేగంగా పంప్ చేయగలగడం ప్రత్యేకత. హోజ్ పైపులు,ఫోమ్ సిస్టమ్,శ్వాస పరికరాలు, రక్షణ సామగ్రితో ఈ వాహనాలు సమృద్ధిగా సన్నద్ధమయ్యాయి. ఆయిల్,రసాయన పరిశ్రమల్లో జరిగే అగ్నిప్రమాదాలను అదుపులోకి తేవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

వివరాలు 

తక్కువ నీటితో మంటల అదుపు

ఇళ్లు,కార్యాలయాలు, పరిశ్రమలు,ఎత్తైన భవనాల్లో మంటలను ఆర్పేందుకు వేగంగా చేరుకునేలా వీటిని రూపొందించారు. 2. సత్వర స్పందన అగ్నిమాపక వాహనాలు(క్విక్‌ రెస్పాన్స్‌ ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు) కొనుగోలు చేసినవి: 40 వ్యయం: రూ.10కోట్లు చిన్న పరిమాణంలో ఉండే ఈ వాహనాలు ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో,ఇరుకు వీధుల్లో సైతం వేగంగా ఘటనా స్థలానికి చేరగలవు. వీవీఐపీ కాన్వాయ్‌లలో కూడా వీటిని వినియోగించవచ్చు.హై ప్రెజర్ వాటర్ మిస్ట్ సిస్టమ్,ఫోమ్ ట్యాంక్, ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు,రెస్క్యూ టూల్స్‌తో ఇవి సన్నద్ధంగా ఉంటాయి. తక్కువ నీటితో మంటలను అదుపు చేసే మిస్ట్ టెక్నాలజీ వీటి ప్రత్యేకత. చిన్న అగ్నిప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు,రెస్క్యూ ఆపరేషన్లలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. ప్రమాదాలు పెద్దవి కాకముందే నియంత్రించడంలో వీటి పాత్ర ముఖ్యమైనది.

వివరాలు 

హై ప్రెజర్‌ బ్రీతింగ్‌ ఎయిర్‌ కంప్రెసర్

కొనుగోలు చేసినవి: 30 వ్యయం: రూ.2.08 కోట్లు పొగ, విష వాయువులు అధికంగా ఉన్న ప్రదేశాల్లో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది శ్వాస కోసం ఉపయోగించే ఎస్‌సీబీఏ సిలిండర్లను నింపేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి. దీంతో రక్షణ చర్యలు మరింత సురక్షితంగా సాగుతాయి.

Advertisement

వివరాలు 

ఇన్‌ఫ్లేటబుల్‌ రెస్క్యూ రబ్బర్‌ బోట్లు

కొనుగోలు చేసినవి: 50 వ్యయం: రూ.2.49 కోట్లు ప్రస్తుతం ఉన్న బోట్లతో పోలిస్తే, కొత్త బోట్లలో ఒకేసారి 10 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. ఫ్లాట్ అడుగు భాగం ఉండటంతో ఒక అడుగు లోతు నీటిలో కూడా ఇవి సులభంగా నడుస్తాయి. మల్టీ ఎయిర్ ఛాంబర్ సిస్టమ్ వల్ల ఒక భాగం దెబ్బతిన్నా బోట్ మిగతా భాగాల సహాయంతో తేలుతూ ఉంటుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.

Advertisement