Bihar: జముయ్ ఘటన బిహార్'లో మరువకముందే మరో ఘటన.. ఐదుగురి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో జముయ్ ఘటన మరువకముందే మరో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్‌లో రోడ్డుపై ఓ యువతి, ఆమెతో ఉన్న యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకుని దుర్భాషలాడుతూ వేధించారు. యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటపడింది. జముయ్ ఘటన జరిగిన కొద్ది రోజులకే సమస్తిపూర్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
వివరాలు
యువతిని చుట్టుముట్టిన వ్యక్తులు
సమస్తిపూర్‌లోని జగత్‌సింగ్‌పూర్ గ్రామంలో యువతి, ఆమెతో ఉన్న యువకుడు గ్రామీణ రహదారిపై ఫొటోలు తీసుకునేందుకు ఆగారు.
అదే సమయంలో బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు వారిని చుట్టుముట్టారు.
అనంతరం యువతిని దుర్భాషలాడుతూ, రోడ్డుపైకి నెట్టివేస్తూ వేధించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపైనా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐదుగురి అరెస్ట్
వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.
ఘటన జరిగిన ప్రాంతం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను నిర్ధారించే ప్రక్రియ చేపట్టినట్లు పోలీసు అధికారి అరవింద్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
జముయ్‌లోనూ విద్యార్థినులపై వేధింపులు
కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని జముయ్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు వేధింపులకు గురైన ఘటన కలకలం రేపింది.
కోచింగ్ తరగతులు ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న వారిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు.
యువకుడి షర్ట్ కాలర్ పట్టుకుని అతడిని యువతి నుంచి దూరంగా లాగారు.
అక్కడి నుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించగా ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను పట్టుకున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీహార్‌లో యువతిపై వేధింపుల వీడియో వైరల్..
#BREAKING 🚨 Samastipur Harassment Incident
— jarvis ☠️ (@Vishii14) September 24, 2026
Four men were arrested after a viral video showed a young woman being harassed, manhandled, and interrogated on a Samastipur bypass road.#Samastipur #BiharPolice #WomenSafety @BiharPolice_ @Samastipur_Pol pic.twitter.com/BaIxLcTTIK