Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో తొమ్మిది మంది గాయపడిన విషయం తెలిసిందే. పేలుడు చాలా తక్కువ తీవ్రతతో జరిగినందు వల్ల.. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదు. ఈ ఘటనపై సీసీబీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు.