LOADING...
Lalu Yadav: రోహిణి ఆచార్య తర్వాత,లాలూ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
రోహిణి ఆచార్య తర్వాత,లాలూ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు

Lalu Yadav: రోహిణి ఆచార్య తర్వాత,లాలూ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లోపు మొదలైన వివాదం ఇంకా చల్లారే పరిస్థితి కనిపించకుండా మరింత ముదురుతోంది. ఇప్పటికే లాలూ పెద్ద కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు రాజీనామా చేసి, కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ కలహాలు ఆగక ముందే, లాలూ దంపతుల మరో ముగ్గురు కుమార్తెలు..రాజలక్ష్మి, రాగిణి, చందా - కూడా పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లో ఉన్న తండ్రి ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. వారితో పాటు వారి పిల్లలు కూడా ఆ ఇంటిని వదిలి వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

వివరాలు 

ఆర్జేడీ నుంచి లాలూ యాదవ్ బహిష్కరణ 

లాలూ-రబ్రీ దంపతుల వివాహం 1973 జూన్ 1న జరిగింది. వారికి మొత్తం తొమ్మిది మంది సంతానం. ఏడుగురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు. వారి పేర్లు: మీసా భారతి,రాగిణి యాదవ్,తేజ్ ప్రతాప్ యాదవ్,అనుష్క యాదవ్,చందా యాదవ్, రోహిణి యాదవ్, రాజలక్ష్మి యాదవ్, హేమ యాదవ్, తేజస్వీ యాదవ్. ఇక రోహిణి ఆచార్య శనివారం మరోసారి వార్తల్లో నిలిచింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ ఓటమి చెందడం, ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెలవడమే కారణమని చెబుతూ, ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు... అదే విధంగా కుటుంబ సంబంధాలను కూడా పూర్తిగా ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తేజ్‌ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి లాలూ యాదవ్ బహిష్కరించారు.