తదుపరి వార్తా కథనం
Air India: కొలంబో-చెన్నై రూట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 07, 2025
04:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యలు, పక్షుల ఢీకొట్టే ఘటనలు తరచుగా దృష్టికి వస్తున్నాయి. తాజాగా, కొలంబో నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఆ సమయంలో 158 మంది ప్రయాణికులు ఉన్నా, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అధికారులు ప్రయాణికులను విమాన నుండి సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఘటన తరువాత ఎయిర్ ఇండియా ఇంజనీర్లు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కారణంగా విమానయాన అధికారులు తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. 137 మంది ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసి, వారికి కొలంబో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా నిర్వహించారు.