Loading...
Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్‌లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు
దర్యాప్తులో సంచలన విషయాలు

Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్‌లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు,నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విమానం కెప్టెన్‌ దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వివరాలు కీలకంగా మారాయి. తనకు కొంతకాలంగా నిద్ర సమస్య ఉందని, అందుకోసం కుటుంబ వైద్యుడు సూచించిన మందులు వాడుతున్నట్లు ఆయన చెప్పినట్లు 'హిందుస్థాన్ టైమ్స్' నివేదిక పేర్కొంది. ఫుకెట్‌లో విమానం బయలుదేరే ముందు తనకు సరిగా నిద్ర పట్టలేదని పైలట్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా నిద్ర సమస్య ఎదుర్కొంటున్నానని ఆయన వివరించినట్లు నివేదిక తెలిపింది.

వివరాలు 

విమానంలో ఏం జరిగింది?

విమానం ప్రయాణంలో ఉండగా సుమారు 30 నుంచి 35 నిమిషాల పాటు తాను నిద్రపోయినట్లు కూడా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

పైలట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రపోయిన తర్వాత ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లి, తిరిగి వచ్చి ఫస్ట్ ఆఫీసర్‌ వెనుక నిల్చున్నారు.

ఆ సమయంలో ఫస్ట్ ఆఫీసర్‌ విమానాన్ని నడుపుతున్నారని, కెప్టెన్‌ మాత్రం పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నారని నివేదిక పేర్కొంది.

అదే సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురై ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. అనంతరం విమానం అదుపులోకి వచ్చి సురక్షితంగా ఢిల్లీ చేరుకుంది.

ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌బస్ A320 విమానం VT-EXO రిజిస్ట్రేషన్‌తో ఈ సర్వీసును నడిపింది.

వివరాలు 

డ్రగ్ టెస్టుల్లోనూ కీలక పరిణామం

ఇందులో ముగ్గురు చిన్నారులు సహా 137 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది కలిపి మొత్తం 145 మంది ఉన్నారు.

ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది గాయపడినప్పటికీ విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు నిబంధనల ప్రకారం సైకోయాక్టివ్ పదార్థాల పరీక్షలు నిర్వహించారు.

కెప్టెన్‌కు నిర్వహించిన తొలి పరీక్షలో డ్రగ్‌ ఆనవాళ్లు ఉన్నట్లు సూచనలు రావడంతో.. నిర్ధారణ కోసం నమూనాను ల్యాబొరేటరీకి పంపించారు.

ఈ పరీక్ష తుది నిర్ధారణ కాదని అధికారులు తెలిపారు.

ఆ తర్వాత నిర్వహించిన నిర్ధారణ పరీక్షలోనూ కెప్టెన్‌ నమూనా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఫలితాలు దర్యాప్తులో భాగంగా పరిశీలించాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

డ్రగ్ టెస్టుల్లోనూ కీలక పరిణామం

ప్రస్తుతం ఇద్దరు పైలట్లను విమానాలు నడపకుండా విధుల నుంచి తప్పించారు.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తున్నాయి.

ఘటనను 'సీరియస్ ఇన్సిడెంట్‌'గా వర్గీకరించారు.

పైలట్ ఆరోగ్య పరిస్థితి, మందుల వినియోగం, డ్రగ్ టెస్ట్ ఫలితాలు, విమాన డేటా తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

హైడ్రాలిక్ వ్యవస్థలోనూ సమస్యలు?

ఇదిలా ఉండగా, విమానం ప్రయాణం అనంతరం రూపొందించినట్లు చెబుతున్న మెయింటెనెన్స్ నివేదికలో పలు సాంకేతిక హెచ్చరికలు నమోదైనట్లు మరో నివేదిక పేర్కొంది.

విమానం హైడ్రాలిక్ వ్యవస్థలు, ఫ్లైట్ కంట్రోల్స్,ఆటోపైలట్‌కు సంబంధించిన సమస్యలు అందులో కనిపించినట్లు సమాచారం.

గ్రీన్, బ్లూ, ఎల్లో హైడ్రాలిక్ వ్యవస్థల్లో తక్కువ ఒత్తిడికి సంబంధించిన హెచ్చరికలు పలుమార్లు వచ్చినట్లు నివేదికలో ఉన్నట్లు పేర్కొన్నారు.

అలాగే బ్లూ, ఎల్లో రిజర్వాయర్లలో ద్రవం స్థాయి తక్కువగా ఉన్నట్లు కూడా నమోదైందని సమాచారం.

ఆటోపైలట్ రెండుసార్లు డిస్‌కనెక్ట్ అయినట్లు కూడా మెయింటెనెన్స్ రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎడమ, కుడి ఎలివేటర్ ఫ్లైట్ కంట్రోల్‌లో లోపాలు,ఇంజిన్ యాంటీ-ఐస్ వ్యవస్థకు సంబంధించిన హెచ్చరికలు,కుడివైపు ముందు,వెనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులకు సంబంధించిన సూచనలు కూడా నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

వివరాలు 

హైడ్రాలిక్ వ్యవస్థలోనూ సమస్యలు?

హైడ్రాలిక్ వ్యవస్థ, ఎలివేటర్ కంప్యూటర్, నోస్ ల్యాండింగ్ గేర్ డోర్/ఇంజిన్ యాంటీ-ఐస్ వాల్వ్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై కూడా హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం.

అయితే ఈ సాంకేతిక సమస్యలు, పైలట్‌ నిద్ర సమస్య, మందుల వినియోగం లేదా డ్రగ్ టెస్ట్ ఫలితాలకు విమానం ఎత్తు కోల్పోయిన ఘటనతో నేరుగా సంబంధం ఉందని ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తేల్చలేదు.

ఘటనకు అసలు కారణం ఏంటనేది విమాన డేటా, నిర్వహణ రికార్డులు, సిబ్బంది వాంగ్మూలాలు తదితర ఆధారాలను పరిశీలించిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT