
Aircraft Crashes: తూప్రాన్ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.
తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెల్లి శివారులో ఈ శిక్షణ విమానం కూలిపోయింది. కూలిపోయిన శిక్షణ విమానం దుండిగల్ ఎయిర్ పోర్టుకు చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న పైలట్, ట్రైనీ పైలెట్ మృతి చెందారు.
హైదరాబాద్ నుంచి ఉదయమే బయలుదేరిన విమానం.. కొద్దిసేపటికే కూలిపోయింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలో విమానం కూలిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పైలెట్, ట్రైనీ పైలెట్ మృతి
మెదక్: కూలిన దుండిగల్ ఎయిర్పోర్టు శిక్షణ విమానం.. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి.. పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవదహనం.. తూప్రాన్ రావెల్లి శివారులో ఘటన.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు. #Planecrash #Flightcrash #Telangana #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) December 4, 2023