Page Loader
Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల
జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల

Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్ జడేజా, జామ్‌నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత జాం సాహెబ్‌ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అజయ్ జడేజా నవానగర్‌ రాజ కుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్ఠిస్తారని, ఈ నిర్ణయం జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరమని తెలిపారు. పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం విజయం సాధించిన దినమైన దసరా పర్వదినం సందర్భంగా, అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నామని జాం సాహెబ్‌ వివరించారు.

Details

క్రికెట్లో అజయ్ జడేజాకు ప్రత్యేక గుర్తింపు

ఈ రాజ్యం, పూర్వం నవానగర్‌గా పిలవబడేది. ప్రస్తుత కాలంలో జామ్‌నగర్‌గా మారింది. గుజరాత్‌లో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ, రాజ కుటుంబ పాదాధికారాన్ని అంగీకరించే సంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయి. అజయ్ జడేజా తన క్రికెట్ అభిరుచితో, 1992-2000 మధ్యలో టీమ్‌ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు. అతను 15 టెస్టులు, 196 వన్డేల్లో భాగమయ్యారు. జడేజా కుటుంబం క్రికెట్ ప్రపంచానికి ఎంతో సుపరిచితమైంది. వారి కుటుంబ సభ్యుల పేర్లు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలకు పెట్టడం ఇందుకు నిదర్శనం. 1996లో జరిగిన ప్రపంచకప్‌లో అజయ్ జడేజా కెప్టెన్సీలో భారత్ పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పాక్‌ బౌలర్లను ఎదుర్కొని, కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశారు.