Supreme Court: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్‌కు 'సుప్రీం' నుంచి ఎదురుదెబ్బ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు అజిత్ పవార్ వర్గానికి శరద్ పవార్ ఫొటోలు, వీడియోలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. అదేవిధంగా అజిత్ పవార్‌ను సొంత కాళ్లపై నిలుచునే భాధ్యత తీసుకోవాలని హెచ్చరించింది. గతేడాది ఎన్‌సీపీ నుంచి వేరుపడి, అతని వర్గం భాజపా-శిందే సర్కారుకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం అజిత్ పవార్ చేయడంతో పాటు, ఆయన వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎంపికయ్యారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
శరద్ పవార్ ఫోటోలను వాడొద్దు
ఆయన వర్గం అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగి, ఎన్నికల సంఘం ద్వారా అసలైన ఎన్‌సీపీగా గుర్తింపు పొందింది. అజిత్ పవార్ వర్గం పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును కూడా దక్కించుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలను జారీ చేసింది.