
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. న్యాయమూర్తులు తమ ఆస్తులను తప్పనిసరిగా కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులు ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. పారదర్శకతను పెంపొందించడంతో పాటు, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరచేందుకు ఈ చర్య చేపట్టారు.
న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించి, డిక్లరేషన్ ద్వారా తమ ఆస్తుల వివరాలను ప్రకటించేందుకు ముందుకొచ్చారు.
ఏప్రిల్ 1న నిర్వహించిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను సమర్పించేందుకు జడ్జీలు సిద్ధమయ్యారు.
వివరాలు
త్వరలో డిక్లరేషన్‌కు సంబంధించిన విధివిధానాలను ఖరారు
సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేయనున్నారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన వివాదం నేపథ్యంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఆస్తుల డిక్లరేషన్‌కు సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న అన్ని న్యాయమూర్తులు ఇప్పటికే తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు ఆ వివరాలను బహిరంగంగా విడుదల చేయలేదు.