రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అత్యాచారం, మోసం, బ్లాక్ మెయిల్ ఆరోపణల నేపథ్యంలో ఆదిల్‌పై మైసూరులోని వీవీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రాఖీ సావంత్ చేసిన ఫిర్యాదు కారణంగా ఆదిల్‌ను పోలీసులు అరెస్టు చేసారు. తన డబ్బును దుర్వినియోగం చేశాడని, గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ రాఖీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో రాఖీతో తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఆదిల్, తర్వాత పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
మా ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు: ఇరాన్ విద్యార్థి
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేళ్ల ఫార్మసీ కోర్సు చదివేందుకు ఇరాన్ నుంచి మైసూరుకు వచ్చిన విద్యార్థినికి ఆదిల్‌కు పరిచయం ఏర్పడింది. ఆదిల్ దుర్రానీ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి వీవీ పురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇరాన్ విద్యార్థి అతనితో కలిసి ఆదిల్ కలిసి ఉన్నాడు. ఆ సమయంలో తాము శారీరకంగా కలిసినట్లు ఇరాన్ విద్యార్థిని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా తనను పెళ్లి చేసుకోమంటే ఆదిల్ తిరస్కరిస్తున్నట్లు పోలీసులకు విద్యార్థిని చెప్పారు. అంతేకాదు తమ ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆదిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ఇరాన్ విద్యార్థిని ఆరోపించారు.