Page Loader
మహిళ మృతిపై అనుమానాలు, మృతదేహాన్ని రెండురోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన భర్త 

మహిళ మృతిపై అనుమానాలు, మృతదేహాన్ని రెండురోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన భర్త 

వ్రాసిన వారు Stalin
Jul 03, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రపరచిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన మహిళను 40 ఏళ్ల సుమిత్రిగా గుర్తించారు. సుమిత్రను భర్తే హత్య చేశాడని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, మృతురాలి భర్త ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె జాండిస్‌తో చనిపోయిందని చెప్పారు. అంత్యక్రియల కోసం ముంబై నుంచి తన కొడుకు తిరిగి వస్తున్నాడని, ఈ క్రమంలో మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రీజర్‌లో భద్రపరిచినట్లు భర్త పోలీసులకు చెప్పారు. సుమిత్రి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భర్తపై మహిళ బంధువుల ఆరోపణలు