Loading...
Visakhapatnam: విశాఖలో కూటమి జయకేతనం.. జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులు కైవసం
విశాఖలో కూటమి జయకేతనం.. జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులు కైవసం

Visakhapatnam: విశాఖలో కూటమి జయకేతనం.. జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులు కైవసం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర రాజకీయాలకు కీలక కేంద్రంగా ఉన్న విశాఖపట్టణం మరోసారి కూటమికి కంచుకోటగా నిలిచింది. 'విశాఖ అంటే కూటమి.. కూటమి అంటే విశాఖ' అనే నినాదాన్ని నిజం చేస్తూ నగర ఓటర్లు తమ రాజకీయ తీర్పును స్పష్టంగా వెల్లడించారు. భూకబ్జాలు, బెదిరింపుల రాజకీయాలకు చోటు లేదని, ప్రశాంతత, అభివృద్ధికే తమ ప్రాధాన్యమని ఓటర్లు తేల్చిచెప్పారు. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ప్రస్తుత గ్రేటర్ విశాఖలోని 120 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. కూటమి అభ్యర్థులు 98 వార్డుల్లో విజయం సాధించారు. మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తెదేపా నేత ముక్కా శ్రావణి 2,44,644 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

వివరాలు 

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ప్రభంజనం కొనసాగినప్పటికీ.. విశాఖ నగరంలోని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులే విజయం సాధించారు.

2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితం కనిపించింది.

అప్పట్లో రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఓటర్లు తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును భారీ మెజారిటీతో గెలిపించారు.

వివరాలు 

విశాఖలో కూటమికి బలమైన ప్రజాదరణ

2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ విశాఖలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

తెదేపా, జనసేన, భాజపా కలిసి పోటీ చేయగా.. విశాఖ లోక్‌సభ స్థానంతోపాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాయి.

ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మూడు అత్యంత భారీ మెజారిటీల్లో విశాఖ జిల్లాలోని గాజువాక, భీమిలి నియోజకవర్గాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఈ వరుస విజయాలు విశాఖలో కూటమికి ఉన్న బలమైన ప్రజాదరణను మరోసారి చాటిచెప్పాయి.

ADVERTISEMENT