LOADING...
Amarnath Yatra: అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం
అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం

Amarnath Yatra: అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

'హర హర మహాదేవ్' నినాదాలతో ముందుకు సాగిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచు శివలింగం తొలి దర్శనం లభించింది. యాత్ర ప్రారంభమైన తొలి రోజే 12 వేల మంది భక్తులు పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడే అమరనాథ్ మంచు శివలింగాన్ని దర్శించేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది యాత్రలో భాగంగా నువ్వాన్, బాల్‌టాల్ బేస్ క్యాంపుల నుంచి రెండు వేర్వేరు బృందాలు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. తొలి రోజు దర్శనం చేసిన భక్తుల్లో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు

అమరనాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ సందేశం..

అమరనాథ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాత్రికులు ఐదు ముఖ్యమైన ప్రతిజ్ఞలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశుభ్రతను కచ్చితంగా పాటించడం, జమ్మూకశ్మీర్‌లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం (వోకల్ ఫర్ లోకల్), ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రక్షాబంధన్ సందర్భంగా సోదరులు, సోదరీమణులకు మొక్కలను బహుమతిగా అందించడం, అలాగే 'దేశం ప్రథమం' అనే స్ఫూర్తితో అమరనాథ్ యాత్రను కొనసాగించాలని ప్రధాని భక్తులను కోరారు.

Advertisement