
Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ మేరకు ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్గ విభేదాల వల్లే శాసనసభ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్ షా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
30 సీట్లు వస్తాయని ఆశించామని కానీ, అనుకున్నన్ని సీట్లు సాధించలేదన్నారు.
Details
గత తప్పులను ఈసారి జరగనివ్వకూడదు : షా
కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అలా జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రం నుంచి అత్యధిక లోక్ సభ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామన్నారు.
మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామన్నారు.
అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ స్వాగతం పలికారు.