Page Loader
Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన 
Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన

Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హలాల్ నిషేధంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా శనివారం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 9ఏళ్ల పనితీరును చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ అప్పులమయంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉందని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదని, అది ఎప్పటికీ జరగదన్నారు. మతపరమైన మైనారిటీలకు 4%కోటాను తొలగించి, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులకు వాటిని ఇస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అప్పులమయంగా మారిన తెలంగాణ: అమిత్ షా