అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది. 24 గంటల్లో హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించడం ఇది రెండోసారి. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు పోలీసులు చెప్పారు. పోలీసు కమిషనర్ సహా ఇతర సిబ్బంది, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నాయి. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం పరిసరాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నట్లు ఏడీసీపీ మెహతాబ్ సింగ్ చెప్పారు. ఈ పేలుడులో ఒక వ్యక్తి కాలికి చిన్న గాయమైనట్లు మెహతాబ్ సింగ్ వెల్లడించారు.
ఇది ఐఈడీ పేలుడు: డీజీపీ
గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లో సంభవించిన పేలుడుపై పంజాబ్ డీజీపీ స్పందించారు. ఇది ఐఈడీ పేలుడు కాదన్నారు. ఇది చాలా తక్కువ తీవ్రత కలిగిన పేలుడు అని చెప్పారు. పేలుడు శబ్దం సమీపంలోని స్థానికులకు వినిపించిందని, తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కూడా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గోల్డెన్ టెంపుల్‌కు ఒక కిలోమీటరు పరిధిలో పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు వల్ల కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు, హెరిటేజ్ స్ట్రీట్‌లోని రెస్టారెంట్ చిమ్నీలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారి తెలిపారు.